భారత్‌పై ఆక్రోశం వెళ్లగక్కిన ట్రంప్.. 25 శాతం పన్ను

ఇప్పటికే వీసా నిబంధనలతో అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న భారతీయులను అయోమయానికి గురిచేస్తోన్న అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. 

trump ready to increase chirges on indian exports

ఇప్పటికే వీసా నిబంధనలతో అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న భారతీయులను అయోమయానికి గురిచేస్తోన్న అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

భారతీయ వస్తువులపై పన్నులు విధిస్తామని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఆదివారం ది మేరీల్యాండ్‌లో జరిగిన ది కన్జర్వేటీవ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌లో అత్యధికంగా పన్నులు విధిస్తున్నారు. వారు మన నుంచి కూడా చాలా వసూలు చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా మనం కూడా పన్నులు విధించడం కానీ లేదా కొన్ని రకాల సుంకాలు వసూలు చేయడం కానీ చేస్తామన్నారు.

భారత్ 100 శాతం పన్ను విధిస్తోంది...కానీ నేను 100 శాతం పన్ను విధించను.. 25 శాతం పన్ను విధిస్తానని స్పష్టం చేశారు. నేను 100 శాతం పన్ను విధించాల్సింది.. కానీ నేను 25 శాతం పన్ను విధించానంటే అందుకు కారణం మీరే.. మీ మద్ధతు నాకు కావాలి.. అని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇతర దేశాల్లో అమెరికా వస్తువులపై పన్ను ఏ విధంగా విధిస్తున్నారో చెప్పేందుకు భారత్‌ను ట్రంప్ ఉదాహరణగా పేర్కొన్నారు. అందుకు ప్రతిచర్యగా ఇప్పుడు అమెరికా కూడా ఆయా దేశాల ఉత్పత్తులపై పన్నులు విధించే సమయం వచ్చిందన్నారు.

దీనినే ‘‘మిర్రర్ ట్యాక్స్ ’’ అంటారని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి 24న భారత్ ఉత్పత్తులపై పన్నులు విధించాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు.

వైట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మన ఎగుమతులపై భారత్ 50 శాతం పన్ను విధిస్తుంటే... అమెరికా మాత్రం దిగుమతి చేసుకునే మోటార్ సైకిల్స్‌పై కేవలం 2.4 శాతం మాత్రమే పన్ను విధిస్తోందని అగ్రరాజ్యాధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios