ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో ''ఎన్నారై టిఆర్ఎస్ సెల్ యూకే'' అధ్వర్యంలో టీఆర్ఎస్ విజయోత్సవ   వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో యూకేలోని ఎన్నారై నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, కేసిఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగరడంతో పాటు కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఎన్నకోవడంతో వారందరు సంబరాలు జరుపుకున్నారు.

ఎన్నారై టిఆర్ఎస్ యూకే సెల్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు, కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ఆద్వర్యంలో  జరిగిన ఈ వేడుకల్లో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అలాగే అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాహాలతో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.

ఈ సంధర్భంగా  శ్రీకాంత్ పెద్దిరాజు  మాట్లాడుతూ... లండన్ లో టీఆర్ఎస్ విజయోత్సవ  వేడుకలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ కు మళ్ళీ అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు, పార్టీ అభ్యర్ధులని ముందుండి గెలిపిచిన కెసిఆర్‌కు, కార్యకర్తలకు, నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో లండన్ నుండి ప్రత్యేక బృందం తెలంగాణకు వెళ్లిందని ఆయన గుర్తు చేశారు. ఇలా నెలరోజులకు పైగా రాష్ట్రమంతటా ప్రచారం నిర్వహించిన అనిల్ కూర్మాచలం మరియు అశోక్ గౌడ్ దుసారి బృందానికి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే  కేటీఆర్ నూతన కార్యనిర్వాహణ అధ్యక్షుడి గా నియమింపబడడం మాకందరికి చాలా సంతోషంగా, స్ఫూర్తిదాయకంగా ఉందని శ్రీకాంత్ పేర్కొన్నారు.
  
 సృజన రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ విజయం తెలంగాణ ప్రజల విజయమని... పార్టీ గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన కెసిఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. 

కార్యదర్శి సత్య చిలుముల మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ఆభివృద్ధి పనులు,సంక్షేమ కార్యక్రమాలే పార్టీని విజయపథం లో నిలిపాయని, ప్రజలంతా విజ్ఞతతో వ్యవహరించి సరైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. కెసిఆర్ రెండవ సారి ముఖ్యమంత్రిగా చూడడం సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రజలంతా అదృష్టవంతులని ఇక రాష్ట్రం మరింత ప్రగతి తో ముందుకు వెళ్తుందని తెలిపారు. 
 
ఈ వేడుకల్లో హాజరైన టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి  కంది మాట్లాడుతూ... ఎన్నారైలంతా టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకున్నారని తెలిపారు. కెసిఆర్ నాయకత్వాన్ని కేవలం రాష్ట్ర ప్రజలే కాదు నేడు దేశ ప్రజలు  కూడా కోరుకుంటున్నారు.  

ఇతర నాయకులు శ్రీకాంత్ జెల్లా, సురేష్ గోపతి, మధు, గణేష్ మరియు నవీన్ మాట్లాడుతూ...  టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం తెలంగాణ చారిత్రాత్మక అవసరమని, ప్రజలంతా కెసిఆర్ వెంటే ఉన్నారని మరొక్కసారి రుజువైందన్నారు. ఇక కెసిఆర్ సేవలు దేశానికి అవసరమని, రాబోయే ఎంపీ ఎన్నికల్లో సైతం రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహించి పార్టీ గెలుపుకి కృషి చేస్తామని తెలిపారు. 

ఖండాంతరాల్లో మొట్టమొదటి ఎన్నారై  శాఖ లండన్ లో స్థాపించిన సంగతి తెలిసిందే కాబట్టి అధ్యక్షుడి హోదాలో కేటీఆర్ లండన్ లో పర్యటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

చివరిగా అధికార ప్రతినిధి రవి రేతినేని వందన సమర్పణ చేస్తూ, ఈ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు, అలాగే లండన్ నుండి తెలంగాణ వెళ్లి ఎన్నికల్లో ప్రచారం చేసిన లండన్ తెరాస బృందానికి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే హాజరైన టాక్ సంస్థ నాయకులకు ఇతర తెలంగాణ బిడ్డలకు కృతఙ్ఞతలు తెలిపారు. 

ఈ వేడుకల్లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ యూకే  ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు, టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్నారై టీ.ఆర్.యస్ యూకే  కార్యదర్శి సృజన రెడ్డి, సత్యమూర్తి చిలుముల, శ్రీకాంత్ జెల్లా,  దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, ప్రవీణ్ వీర, మధుసూదన్ రెడ్డి,  హరి నవపేట్,  మల్లా రెడ్డి, సురేష్ గోపతి, నవీన్ మాదిరెడ్డి, రవి ప్రదీప్, గణేష్ పాస్తం,సురేష్ బుడగం,నవీన్ భువనగిరి, భాస్కర్ రావు, సత్యపాల్ రెడ్డి, రవి కుమార్ రేటినేని, అశోక్ అనంతగిరి, ప్రశాంత్, రామకృష్ణ, రాకేష్ పటేల్, వంశీ పొన్నం, శ్రీనివాస్ మేకల, మహేందర్,  సతీష్,  లత కూర్మాచలం, స్వాతి బుడగం, సుప్రజ పులుసు, మమత జక్కీ ,శ్వేతా మహేందర్, శైలజ జెల్ల, అపర్ణ, శ్రీ లక్ష్మి, దీపాక్షర   తదితరులు హాజరయ్యారు.