లండన్‌లో ‘‘టీఆర్ఎస్ మిషన్’’ ప్రారంభం
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ప్రచారంలో ఎన్‌ఆర్ఐలను భాగస్వాములను చేయాలని భావించిన టీఆర్ఎస్ అధిష్టానం.. దీనిలో భాగంగా లండన్‌లో ‘టీఆర్ఎస్ మిషన్’ ఎన్నికల కార్యాలయాన్ని యూకే టీఆర్ఎస్ నేతలతో కలిసి.. ఎంపీ కవిత ప్రారంభించారు
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ప్రచారంలో ఎన్‌ఆర్ఐలను భాగస్వాములను చేయాలని భావించిన టీఆర్ఎస్ అధిష్టానం.. దీనిలో భాగంగా లండన్‌లో ‘టీఆర్ఎస్ మిషన్’ ఎన్నికల కార్యాలయాన్ని యూకే టీఆర్ఎస్ నేతలతో కలిసి.. ఎంపీ కవిత ప్రారంభించారు.
ఎన్నారై టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మరియు ఎన్నారై టీఆర్‌ఎస్ -యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి నాయకత్వంలో టీఆర్‌ఎస్-యూకే టీమ్ ఈ వార్ రూమ్ కార్యాలయాన్ని ప్రారంభించింది. టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త మహేశ్ బిగాల స్కైప్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు సూచనలు, సలహాలు అందించారు.
ఈ కార్యాలయం ద్వారా ఆసరా పించన్లు, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాల్ క్యాంపేయిన్ వాలంటీర్లు తెలంగాణలోని ఓటర్లకు ఫోన్ కాల్ ద్వారా వివరించనున్నారు.
అనీల్ కూర్మాచలం మాట్లాడుతూ ఏ విధంగా నైతే ఉద్యమ సమయంలోఎన్నారై టీఆర్‌ఎస్-యూకే తన వంతు పాత్ర పోషించిందో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా క్రియాశీలకంగా ప్రచారం చేయబోతోందని అన్నారు.
రాబోయే రోజుల్లో ప్రతీ కార్యకర్త తమ తమ శక్తి మేరకు ప్రచారం చేసి గత నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీ.ఆర్.యస్ పార్టీ ని అధికారంలో తీసుకొచ్చే విధంగా పని చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూకే టీఆర్ఎస్ అధ్యక్షులు దూసరి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల తదితరులు పాల్గొన్నారు.