పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు కువైట్‌లోని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం నివాళులర్పించింది. ఈ సందర్భంగా కువైట్ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షురాలు అభిలాష గోడిశాల మాట్లాడుతూ.. కశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిలో అనేకమంది జవాన్లు మరణించడతో పాటు మరికొంతమంది తీవ్రంగా గాయపడటం పట్ల తాము తీవ్రంగా కలత చెందామన్నారు.

అమర జవాన్ల కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రదాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయిన నేపథ్యంలో కువైట్‌లో జరుప తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను రద్దు చేస్తున్నట్లు అభిలాష తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శిచిన కార్యవర్గ సభ్యులు, మిగిలిన వారితో కలిసి రక్తదానం చేశారు. 

"