లండన్ లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఏప్రిల్ 27 శనివారం లండన్ లో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ యూకే ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఏప్రిల్ 27 శనివారం లండన్ లో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ యూకే ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సంబరాలకు యూకే కార్యవర్గ సభ్యులు పాల్గొని, టీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవాలు నిరాడంబరంగా నిర్వహించామని అన్నారు.
ఈ సంధర్భంగా సభ్యులు మాట్లాడుతూ టి.ఆర్.ఎస్ పార్టీ లో ఉండటం తమ అదృష్టం అనీ, తెలంగాణ ప్రజల ఆధరాభిమానాలే పునాదులుగా, అనుక్షణం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 18వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, కొద్దిమందితో ప్రారంభం అయిన టీఆర్ఎస్ కేంద్రంతో పోరాడి తన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా నేడు రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా నిలిచిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ యూకే శాఖ ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చంద్రశేఖర్ గౌడ్, అడ్వైసరీ బోర్డు సభ్యులు వెంకట్ రెడ్డి దొంతుల, ప్రవీణ్ కుమార్ వీర, సెక్రటరీ సృజన్ రెడ్డి చాడ,సత్య చిలుముల,అధికార ప్రతినిది రవి ప్రదీప్ పులుసు, మీడియా ఇంచార్జ్ సత్యపాల్ పింగిళి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.