రాహులే మా అధ్యక్షుడు: టీసీసీ ఎన్నారై సెల్ తీర్మానం

టీపీసీసీ ఎన్నారై సెల్ సైతం రాహుల్ రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిందిగా తీర్మానం చేసింది. గురువారం లండన్‌లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది

tpcc nri cell pass resolution over Rahul to withdraw his resignation

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. అయితే ఆయన నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం వుందని రాజీనామాను వెనక్కు తీసుకోవాలని పలు రాష్ట్రాల పీసీసీలు తీర్మానం చేస్తున్నాయి.

తాజాగా టీపీసీసీ ఎన్నారై సెల్ సైతం రాహుల్ రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిందిగా తీర్మానం చేసింది. గురువారం లండన్‌లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా లండన్ పర్యటనలో వున్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రామచంద్ర కుంతియాకు రాహుల్‌నే అధ్యక్షుడిగా కొనసాగాలంటూ వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ , కో కన్వీనర్  సుధాకర్ గౌడ్ ,  ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్  యు కె అధ్యక్షుడు కమల్ డాలివాల్.  టీపీసీసీ ఎన్నారై సెల్ అడ్వైసరి మెంబెర్ ప్రవీణ్ రెడ్డి , కార్యదర్శి  బాలకృష్ణ రెడ్డి , కోర్ సభ్యులు మణికంఠ ,నగేష్ లు పాల్గొన్నారు.

tpcc nri cell pass resolution over Rahul to withdraw his resignation

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios