అమెరికాలో అన్నాచెల్లెళ్ల సజీవదహనం...25 రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహాలు

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ముగ్గురు అన్నాచెల్లెళ్ల మృతదేహాలు వారి స్వగ్రామం నల్గొండ జిల్లాకు ఇవాళ చేరుకోనున్నాయి. జిల్లాకు చెందిన సాత్విక, సుహాన్, జయ సుచిత్‌లు అన్నాచెల్లెళ్లు వీరు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి కొలిర్‌వ్యాలీలో నివసిస్తున్నారు. 

Three Telangana teenagers burnt alive in america

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ముగ్గురు అన్నాచెల్లెళ్ల మృతదేహాలు వారి స్వగ్రామం నల్గొండ జిల్లాకు ఇవాళ చేరుకోనున్నాయి. జిల్లాకు చెందిన సాత్విక, సుహాన్, జయ సుచిత్‌లు అన్నాచెల్లెళ్లు వీరు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి కొలిర్‌వ్యాలీలో నివసిస్తున్నారు.

ఈ క్రమంలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్పలు చేస్తుండగా ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న వీరు ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు అవసరమైన అన్ని రకాల అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన ప్రక్రియ ఆలస్యం కావడంతో తరలింపులో జాప్యం జరిగింది.

తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు వారి మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. శుక్రవారం ఉదయం మృతదేహాలు అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

కుటుంబసభ్యుల కోరిక మేరకు ముందుగా నారాయణగూడలోని బాప్టిస్ట్ చర్చికి తరలించి రెండు గంటల పాటు అక్కడే ఉంచుతామన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం వారి స్వగ్రామమైన నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం గుర్రపుతండాకు తరలిస్తామని అధికారులు వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios