ఓ తెలుగు కుర్రాడు.. తన ప్రతిభతో.. స్మార్ట్ హెల్మెట్ ని కనిపెట్టాడు. హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి కి  చెందిన ఓ తెలుగు కుర్రాడు.. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ లో స్థిరపడ్డాడు. 

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవడానికి న్యూయార్క్ వెళ్లిన కృష్ణ.. స్మార్ట్ హెల్మెట్‌ని కనిపెట్టి 'ఫోర్బ్స్ 30 అండర్ 30'లో స్థానం సంపాదించుకున్న ఏకైక భారతీయుడిగా నిలిచాడు. 2012లో ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లిన కృష్ణ మండ 2016లో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 

వెనక నుంచి వేగంగా వచ్చిన వాహనం కృష్ణ వెళ్తున్న బైక్‌ని ఢీ కొట్టడంతో అతని చెయ్యి విరిగిపోయింది. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదనే ఆలోచనతో కృష్ణ.. స్మార్ట్ హెల్మెట్‌ని కనిపెట్టాడు. వెనక నుంచి వచ్చే వాహనాన్ని కూడా గమనించే విధంగా ఈ హెల్మెట్‌ని రూపొందించాడు. లేటెస్ట్ సెన్సార్ టెక్నాలజీతో రూపొందించిన ఈ హెల్మెట్‌ని త్వరలో భారత్‌లో కూడా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాడని కృష్ణ తల్లి అన్నపూర్ణ తెలిపారు.