అమెరికాలో ఓ తెలుగు మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన నార్త్ కరోలినాలో చటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... గజం వనిత(38) అనే మహిళకు వివాహమై ఓ కుమార్తె, ఓ  కొడుకు ఉన్నాడు. భర్త, పిల్లతో కలిసి ఆమె అమెరికాలో నివసిస్తోంది. 

కాగా... అత్తింటి వేధింపులు తాళలేక కొంతకాలంగా హైదరాబాద్‌లోని నాగోల్‌ సాయినగర్‌లో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే జులై నెలలో నార్త్‌ కరోలినాలోని భర్త వద్దకు తిరిగివెళ్లిపోయింది. ఆ తర్వాత 2 నెలలనుంచి తల్లిదండ్రులతో కాంటాక్ట్‌లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం వనిత తల్లిదండ్రులకు ఆమె సూసైడ్‌ చేసుకున్నట్లు సమాచారం అందింది.

అయితే... అత్త, భర్త పెడుతున్న వేధింపులు తట్టుకోలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వనిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలంటూ వేడుకుంటున్నారు. ఘటన జరిగిన అనంతరం ఆమె భర్త రాచకొండ శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న కరోలినా పోలీసులు విచారణ చేపట్టారు.