అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు టెక్కీ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి చింతల శివతేజ(26) అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. కాగా... ఈ ఘటన జరిగి రెండు రోజులు కాగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలానికి చెందిన రామాంజనేయులు, వెంకటరత్నం దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  మూడో కుమారుడు శివతేజ ఆరేళ్ల క్రితం అమెరికావెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు. తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కాగా... రెండు రోజుల క్రితం తన సహచర ఉద్యోగినితో కలిసి ఆఫీసుకి కారులో బయలు దేరాడు.

ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివతేజ, అతని సహచర ఉద్యోగిని ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కాగా.. వారి ఇద్దరి మృతదేహాలు రెండు రోజులుగా ఆస్పత్రిలోనే ఉండటం గమనార్హం. కాగా.. కొడుకు దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో.... అతని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.