విషాదాంతమైన విహారయాత్ర.. అమెరికాలో జలపాతంలోపడి తెలుగు విద్యార్ధి మృతి
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.. అక్కడి జలపాతంలో పడి తెలుగు విద్యార్ధి మరణించాడు
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.. అక్కడి జలపాతంలో పడి తెలుగు విద్యార్ధి మరణించాడు. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌లోని విచిత ఫాల్స్ మిడ్ వెస్ట్రన్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న 26 ఏళ్ల నాగ సుభాష్ మోతురు స్నేహితులతో కలిసి ఓక్లహామాలోని ఎత్తైన జలపాతమైన టర్నర్ ఫాల్స్‌కు వెళ్లాడు.
ఆ సమయంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మునిగిపోయాడు. అయితే కరోనా కారణంగా టర్నర్ ఫాల్స్ వద్ద లైఫ్ గార్డులు ఎవరూ విధుల్లో లేకపోవడంతో సుభాష్ ప్రాణాలు రక్షించలేకపోయామని సిటీ ఆఫ్ డేవిస్ పోలీసులు వెల్లడించారు.
కాగా నాగ సుభాష్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు సహాయం చేయాల్సిందిగా అతని సోదరి మృధాలిని ఇరు దేశాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read:
ట్రంప్ నిర్ణయం: 40 వేల మంది వైద్య నిపుణులకు గ్రీన్ కార్డు.. ఇది పక్కా?
ఎన్ఆర్ఐలను ఆదుకోండి.. తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఫైర్