అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్ధి దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌కు చెందిన వసీం అలీ అనే విద్యార్ధి ఉన్నత చదువుల కోసం రెండున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు

telugu student killed in road accident in america

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌కు చెందిన వసీం అలీ అనే విద్యార్ధి ఉన్నత చదువుల కోసం రెండున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు.

ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున అలీ తన కారులో వెళుతండగా.. వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరో మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది.

వసీం మరణవార్త విని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాల్సిందిగా అతని కుటుంబసభ్యులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios