అమెరికాలో బోటు ప్రమాదం, విశాఖ యువకుడు మృతి
అమెరికాలో తెలుగు యువకుడు గల్లంతయ్యాడు. విశాఖకు చెందిన అవినాష్ ఉన్నత చదువు కోసం ఐదేళ్ల కిందట అమెరికాకు వెళ్లిన అతను.. రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి బోటు షికారుకు వెళ్లాడు
అమెరికాలో తెలుగు యువకుడు గల్లంతయ్యాడు. విశాఖకు చెందిన అవినాష్ ఉన్నత చదువు కోసం ఐదేళ్ల కిందట అమెరికాకు వెళ్లిన అతను.. రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి బోటు షికారుకు వెళ్లాడు.
అక్కడ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడు. అవినాష్ మరణవార్తను అతని స్నేహితులు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.