మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సెగ్యం సంధ్య అనే వివాహిత అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన సమాచారం గ్రామంలోని కుటుంబ సభ్యులకు అందింది.

కుటుంబ కలహాలతో సంధ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.  భర్త వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి తొర్రూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంధ్య తండ్రి: మహేందర్, తల్లి విమలమ్మ గ్రామంలో ఉంటున్నారు. సంధ్య అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ నగరంలో ఉంటోంది.