అమెరికాలోని బోస్టన్ బీచ్ లో తెలంగాణ విద్యార్థి గల్లంతు అయ్యాడు. ఉన్నత చదువుల నిమిత్తం తెలంగాణకు చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి అనే యువకుడు అమెరికా వెళ్లాడు. అక్కడే ఓ ప్రముఖ యూనివర్శిటీలో విద్యను కొనసాగిస్తున్నాడు.

కాగా.. ఆదివారం ఈస్టర్ పండగను పురస్కరించుకొని స్నేహితులతో కలిసి బీచ్ కి వెళ్లాడు. సరదాగా స్నేహితులతో కలిసి సముద్రంలోకి దిగిన శ్రవణ్ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి పోయాడు. అతని స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. శ్రవణ్ కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.