కెనడాలో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తూ నీటమునిగి ప్రాణాలు విడిచాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖల్‌కు చెందిన బుస్సు జగన్‌మోహన్‌ రెడ్డి(29)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కెనడాలోని టోరంటోలో ఓ సరస్సులో పడి అతను మృతిచెందినట్టు సమాచారం అందింది. 2012లో హైదరాబాద్‌లోని స్ఫూర్తి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసిన అతను ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. పూరి​ వివరాలు తెలియాల్సి ఉంది.