డెట్రాయిట్ లోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న సాయికృష్ణ అనే తెలంగాణ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మహబూబాబాద్: అమెరికాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ కు చెందిన యువకుడిపై కాల్పులు దుండగులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన ఈ నెల 3వ తేదీన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

డెట్రాయిట్ లోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న సాయికృష్ణ అనే తెలంగాణ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సాయికృష్ణ కుడిచేతిపై, మెడపై గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు సాయికృష్ణకు చెందిన నగదును, గుర్తింపు కార్డును, కారును తీసుకుని పారిపోయారు. మహబూబాబాద్ కు చెందిన ఎల్లయ్య, శైలజ దంపతుల కుమారుడు సాయికృష్ణ.

సాయికృష్ణపై దాడికి సంబంధించిన సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కుమారుడిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Scroll to load tweet…