ఆస్ట్రేలియాలో తెలంగాణ టెక్కీ అర్జున్ రెడ్డి మృతి
హైదరాబాద్‌లోని వనస్థలిపురంోలని బిడిఎల్ కాలనీకి చెందిన సామ అర్జున్ రెడ్డి(36) గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటూ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్టవేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన మాట్లాడిన అర్జున్ రెడ్డి మధ్యాహ్నానికి గుండెపోటుతో మృతి చెందారు.
హైదరాబాద్: తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అర్జున్ రెడ్డి ఆస్ట్రేలియాలో మరణించాడు. గుండెపోటుతో అతను మృత్యువాత పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. గుండెపోటు రాగానే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి చేర్చేలోగానే అతను మరణించాడు.
హైదరాబాద్‌లోని వనస్థలిపురంోలని బిడిఎల్ కాలనీకి చెందిన సామ అర్జున్ రెడ్డి(36) గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటూ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్టవేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన మాట్లాడిన అర్జున్ రెడ్డి మధ్యాహ్నానికి గుండెపోటుతో మృతి చెందారు.
ఆయనకు భార్య మహేశ్వరి, కూతురు ఇషిక ఉన్నారు. సిడ్నీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అర్జున్‌రెడ్డి ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం విధుల్లో ఉండగా ఆయనకు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో తన భార్యకు ఫోన్‌లో సమాచారం అందించారు.
మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా వలిగొండ మండలం గొల్లపల్లి గ్రామం. మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు