లండన్‌: తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు.. హాజరైన ఏపీ, తెలంగాణ ప్రవాసులు

తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ ఆధ్వర్యంలో బ్రిటన్ రాజధాని లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రజలు హాజరయ్యారు. 

Telangana NRI forum celebrates International Womens Day in London

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ 75 ఏళ్ల (75 years of India’s Independence) స్వత్రంత్ర భారత్ సంబరాల్లో భాగంగా.. లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టీఏఎఫ్‌) (Telangana NRI forum ) ఆధ్వర్యంలో అంత‌ర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల‌ను (International Women’s Day) ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ నలుమూలల నుంచి వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు వారందరిని ఆహ్వానించారు.

ఇండియాలో ఈ 75 ఏళ్లలో సాధించిన మహిళా సమూలాభివృద్ధి, వారికి అందించాల్సిన ప్రోత్సాహం గురించి సెషన్స్ ఏర్పాటు చేసారు. ఇందులో చేనేత, గొల్లభామ, పెంబర్తి, నిర్మల్ బొమ్మలని ప్రచారం చేస్తూ ఈ సంవత్సరం కరీంనగర్‌కి చెందిన ఫిలిగ్రి వెండి కళలని ప్రోత్సహించి ప్రచారం చేయాలని నిర్ణయించారు. కాగా, ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఎన్నారై ఫోరమ్ కోర్ కమిటీ సభ్యులు మీనా అంతటి, గంప జయశ్రీ, శౌరి గౌడ్ సమర్థవంతంగా నిర్వహించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios