తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్‌లో బతుకమ్మ వేడుకలు
తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యం లో లండన్ బతుకమ్మ , దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. యూరోప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించారు . సుమారు 3000 మందికి పైగా బతుకమ్మ ఆటలో పాల్గొని విజయవంతం చేశారు
తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యం లో లండన్ బతుకమ్మ , దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. యూరోప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించారు . సుమారు 3000 మందికి పైగా బతుకమ్మ ఆటలో పాల్గొని విజయవంతం చేశారు.
మొదట దుర్గా అమ్మవారి పూజ తో ప్రారంభం చేసి , ఇండియా నుండీ ప్రత్యేకంగా తెచ్చిన జమ్మి చెట్టుకు పూజ నిర్వహించి అనంతరం బతుకమ్మ ఆట, కట్టే కోలాటం ఆడారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు భావి పౌరులకు సాంప్రదాయాలు తెలిపేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్నారై సంఘాలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రకృతిని పూజించే పండుగ చేసుకోవడం తెలంగాణ సంస్కృతికి చిహ్నమని కొనియాడారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన భారత రాయబార కార్యాలయం ఉన్నతాధికారి శ్రీమనమీత్ నరాంగ్ మాట్లాడుతూ సౌత్ ఇండియాలో అతిపెద్ద సంస్కృతిక కార్యక్రమాన్ని మొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో చేయడం చూస్తున్నానన్నారు.
పువ్వుల పండుగ చేస్తారని తెలిసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించిందని తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమానికి రావడం బాగుందన్నారు.
లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు కాపాడలిసిన బాధ్యత ఎన్నారై ల పైన ఉందని తెలిపారు. గత ఏడేళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించినందుకు తెలంగాణ ఎన్నారైలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంతటి మాట్లాడుతూ యూరోప్ లోనే అతి పెద్ద బతుకమ్మ నిర్వహణ బాధ్యత కు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలుపారు.
2010 లో నిర్వహణ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఆర్ధిక వనరులు ఎలా సమకూర్చాలో తెలియని సమయంలో యూరోప్ లోనే మొట్ట మొదటి బతుకమ్మ కు పునాదులు వేసి నిర్వహించిన తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్ ను అభినందించారు.
2012 లో బ్రిటన్ లో వివిధ ప్రాంతాల్లో ఊరూరా బతుకమ్మ నిర్వహించి బతుకమ్మ భావజాలాన్ని చాటుతూ ప్రతి తెలంగాణ బిడ్డ బతుకమ్మ ఆట లో పాల్గొనే స్థాయి కి చేరుకుందని ఆయన గుర్తుచేశారు.
వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్ ,ప్రధాన కార్యదర్శి రంగు వెంకట్ , కార్యదర్శి పిట్ల భాస్కర్ , అడ్వైసరి సభ్యులు డా శ్రీనివాస్ , మహేష్ జమ్ముల , వెంకట్ స్వామి , బాలకృష్ణ రెడ్డి , మహేష్ చాట్ల ,శేషు అల్లా , వర్మా , స్వామి ఆశా , అశోక్ మేడిశెట్టి , సాయి మార్గ్ ,వాసిరెడ్డి సతీష్ రాజు కొయ్యడ, నర్సింహారెడ్డి నల్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.