అమెరికాలో తెలంగాణకు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. 16ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో అతను ప్రాణాలు కోల్పోయాడు. 


అమెరికాలో తెలంగాణకు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. 16ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో అతను ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ కి చెందిన సునీల్ ఎడ్లా.. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలోని వెంటార్న్ సిటీలో స్థిరపడ్డారు. కాగా.. ఆయన ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా.. వారి ఇంటి ఎదుట ఉండే బాలుడు తుపాకీతో కాల్చి చంపేశాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పథకం ప్రకారమే బాలుడు సునీల్ ని కాల్చి చంపాడని స్థానికులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన అనంతరం సునీల్‌ కారును తీసుకొని నిందితుడైన బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన తన తల్లి 95వ జన్మదిన వేడుకల కోసం భారత్‌ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలా జరగడం దారుణమని సునీల్‌ బంధువులు వాపోతున్నారు.

సునీల్‌ తలపై కాల్చడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం ఆయన‌ వాహనాన్ని వేసుకొని వెళ్లిన బాలుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆయన వాహనంలో ఉన్న ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా జాడ తెలుసుకుని అతడిని అరెస్టు చేశారు. సునీల్‌ మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే.. ఎందుకు హత్య చేశారనే విషయం మాత్రం తెలియరాలేదు.