టిక్ టాక్ వీడియో ఎఫెక్ట్.. గల్ఫ్ లో తెలంగాణ వ్యక్తి ఆత్మహత్య
జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అక్కడ కష్డపడుతూ... కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా... అక్కడి కష్టాలు, నష్టాలను తట్టుకునేందుకు సోషల్ మీడియాకి బానిసగా మారాడు. అయితే... అదే సోషల్ మీడియా అతని ప్రాణాలు తీసింది. తెలంగాణ వ్యక్తి గల్ఫ్ లో ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా గంధారి మండలం గండీపేటకు చెందిన సాయిలు(49) సౌదీలోని రియాద్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా అక్కడే ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే... అక్కడ ఉన్న సమయంలోనే సాయిలుకి సోషల్ మీడియాలో గడపడం అలవాటు అయ్యింది. ఈ క్రమంలో.. టిక్ టాక్ వీడియోలు చేస్తే డబ్బులు సంపాదించవచ్చని కొందరు స్నేహితులు అతనికి సూచలను చేశారు. దీంతో.. డబ్బు వస్తుంది కదా కొన్ని వీడియోలు చేశాడు.
ఆ వీడియోలు చూసిన కుటుంబసభ్యులు సాయిలు ని మందలించారు. పెళ్లికి ఎదిగిన కూతురిని పెట్టుకొని ఆ వీడియోలు ఏంటని అనడంతో... వాటిని డిలీట్ చేశాడు. అయితే... తాను డిలీట్ చేసినప్పటికీ కొన్ని వీడియోలు స్నేహితుల దగ్గర ఉన్నాయి. వాటిని వాళ్లను కూడా డిలీట్ చేయమని సాయిలు కోరాడు. వాళ్లు చేయకుండా అతనిని ఏడిపించడం మొదలుపెట్టారు. వాటిని డిలీట్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడు. అయినా మిత్రులు పెద్దగా పట్టించుకోలేదు.
కాగా... గల్ఫ్ సెలవుల నేపథ్యంలో స్వదేశానికి వద్దామని భావించిన సాయిలు తన స్నేహితుల వద్ద ఉన్న టిక్ టాక్ వీడియోల కారణంగా పరువు పోతుందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... సాయిలు మరణం అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.