తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబరాలు న్యూజీలాండ్ శాఖ మహా బతుకమ్మ తో విశ్వవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబరాలు న్యూజీలాండ్ శాఖ మహా బతుకమ్మ తో విశ్వవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
పెద్ద సంఖ్యలో అతిథులతో, సంప్రదాయ బతుకమ్మ ఆట పాటలతో, బతుకమ్మ మరియు పర్యావరణ పరిరక్షణ సమాచారం తో, హరితాభివృద్ధి వంటి సామాజిక కారక్రమాల ప్రోత్సాహం, చిన్న పెద్దలకు పోటీలు మరియు బహుమతులు, బతుకమ్మలు తెచ్చిన ఆడబిడ్డలకు పట్టు చీరలు, కమ్మనైన విందు భోజనం తో, కన్నుల పండుగయిన మహా బతుకమ్మను తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ నిర్వహించింది.
తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ అధ్యక్షులు శ్రీమతి జ్యోతి మల్లికార్జునరెడ్డి గారు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి సహాయ సహకారాలను కొనియాడుతూ జాగృతి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు అక్కడి ఎంపీలు హాజరయ్యారు.
జాగృతి న్యూజిలాండ్ అధ్యక్షులు శ్రీమతి జ్యోతి ముద్దం గారు, కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 9 రోజులు, 9 ప్రదేశాల్లో జరిగే బతుకమ్మ సంబరాలకు అందిరిని ఆహ్వానించారు. అనంతరం భక్తి తో గౌరమ్మను పూజించి తమ పాటలతో బతుకమ్మను సాగనంపారు.
శ్రీమతి ప్రసన్న గుమ్ముడవెల్లి, సరితా కొంక,సంధ్య గౌడ్, శ్రీమతి సుకృతి పడాల, శ్రీ అయూబ్ ఖాన్, శ్రీ పవన్ కొల్లోజు, శ్రీ రాజవర్ధన్ రెడ్డి, శ్రీ విక్రమ్ కటుకం, శ్రీ వెంకట హరి ప్రసాద్, సంతోష్ తుక్కాపురం, శ్రీమతి ప్రేమ, శ్రీమతి ప్రియ, శ్రీ ప్రసన్ తిరునగరి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 1, 2019, 9:05 PM IST