నరాలు తెగే ఉత్కంఠ మధ్య దుబ్బాకలో బీజేపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపు తెలంగాణ కాషాయ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలో టీబీజేపీ అస్ట్రేలియా ఆధ్వర్యంలో విజయయోత్సవ సంబరాలు జరిగాయి.  మెల్‌బోర్న్‌లోని అతిథి  ఇండియన్ రెస్టారెంట్లో ఈ వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు జూమ్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన విజయాన్ని కోరుకున్న ఆస్ట్రేలియాలోని బీజేపీ కార్యకర్తలకు , తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు తెలిపారు .

 

 

బిజెపి కార్యకర్తల కోరిక మేరకు వచ్చే ఏడాది మెల్‌బోర్న్‌కు  తప్పకుండా వస్తానని రఘునందన్ రావు స్పష్టం చేశారు. అలాగే కొన్ని నెలల ముందు అస్ట్రేలియాలో బిజెపి కార్యకర్తల జూమ్ సమవేశాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో , ఇటీవల మరణించిన బీజేపీ కార్యకర్త గంగల శ్రీనివాస్‌కు సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమం శ్రీపాల్ రెడ్డి బొక్కా , మహెష్ రెడ్డి బద్దం , రామ్ యంగల్ , సాయి మారం అధ్వర్యంలో వరుణ్ సంకినేని సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాయవాది బద్రీనాథ్ , మేడపాటి బాబుల్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి కర్ర , విశ్వనాథ కపిల , శాంతి స్వరూప్ , శ్రీకాంత్ కోరవేణి , మధుసూదన్ ఏనుగు , మారుతీ తల్లమ్ తదితరులు పాల్గొన్నారు.