ప్రియురాలి మోజులో పడి.. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను.. కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా  అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

భారత సంతతికి చెందిన రన్వీత్ కౌర్ అనే మహిళ ఆస్ట్రేలియాలో కుటుంబంతో సహా స్థిరపడ్డారు.  కాగా.. ఆమెకు కొంతకాలం క్రితం పంజాబ్ కి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కాగా.. రన్వీత్ కౌర్ భర్తకి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ క్రమంలో రన్వీత్ ని వదిలించుకోవాలని ఆమె భర్త భావించాడు. ఈ క్రమంలో మార్చి 14వ తేదీన ఆమెను భారత్ కి రప్పించి ప్రియురాలి సహాయంతో దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కెనాలో పడేశారు.

మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. రన్వీత్ భర్తను అతని ప్రియురాలిని అరెస్టు చేశారు.