ఉస్మానియా భూముల బాధ్యత ప్రభుత్వానిదే: ఉస్మానియా అలుమ్ని యూకే & యూరప్

ఉస్మానియా  భూములు  ఖబ్జా  కాకుండా  కాపాడలిసిన  బాధ్యత రాష్ట్ర  ప్రభుత్వం మీదే ఉంటుందని తెలిపింది ఉస్మానియా అలుమ్ని యూకే & యూరప్. ఆ భూములను కాపాడాలని ఈ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది

osmania alumni uk & europe letter to telangana govt over university lands

ఉస్మానియా  భూములు  ఖబ్జా  కాకుండా  కాపాడలిసిన  బాధ్యత రాష్ట్ర  ప్రభుత్వం మీదే ఉంటుందని తెలిపింది ఉస్మానియా అలుమ్ని యూకే & యూరప్. ఆ భూములను కాపాడాలని ఈ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

డి డి  కాలనిలో  ఉస్మానియా  భూమి లో  ఆక్రమించి  కట్టడాలు  నిర్మించడం  తగదని ఈ సంస్థ ప్రతినిధులు అన్నారు. అసలు జీహెచ్ఎంసీ అనుమతులు ఎలా ఇచ్చిందో పున: పరిశీలన చేయాలని అలుమ్ని కోరింది.

అనేక సామాజిక ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ జీవం పోసిందని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని ఈ సంస్థ గుర్తుచేసింది. అలాంటి వర్సిటీని అన్ని రకాలుగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పూర్వ విద్యార్ధులకు కూడా ఉంటుందని అలుమ్ని తెలిపింది.

Also Read:ఓయూలో కాంగ్రెస్ నేతల టూర్, ఉద్రిక్తత: విద్యార్థుల ఆందోళన

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి ఉస్మానియా భూములపై సమగ్ర సర్వే చేయించి భవిష్యత్తులో ఇవి మరోసారి కబ్జా కాకుండా చూడాలని ఈ సంస్థ ప్రతినిధులు  కోరారు.

ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజలు కూడా ఉస్మానియాకి అండగా నిలవాలని, పోలీస్ శాఖ సైతం అక్రమ కట్టడాలు జరగకుండా చూడాలని ఉస్మానియా అలుమ్ని ఛైర్మన్ గంప వేణుగోపాల్, అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, మహేశ్ జమ్ముల, కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios