అమెరికాలో భారత యువకుడి మృతి

డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా బల్జీత్‌ను దుండగులు అడ్డగించారు. బల్జీత్‌ వద్ద ఎలాంటి సొమ్ము, విలువైన వస్తువులు లేకపోవడంతో అతడిపై కాల్పులు జరిపి పరారయ్యారని బాధితుడి తాత ఫమ్మాన్‌ సింగ్‌ చెప్పారు. 

On way home, Punjab resident killed in USA

అమెరికాలో ఓ భారత యువకుడు మృతి చెందాడు. అమెరికాలోని ఓ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో పని ముగించుకుని ఇంటికి వెళుతున్న పంజాబ్‌కు చెందిన విద్యార్థి బల్జీత్‌ సింగ్‌ అలియాస్‌ ప్రిన్స్‌ (28)ను దుండుగులు కాల్చిచంపారు. చికాగోలో బుధవారం రాత్రి ఈ ఘటన జరగ్గా గురువారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. 

డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా బల్జీత్‌ను దుండగులు అడ్డగించారు. బల్జీత్‌ వద్ద ఎలాంటి సొమ్ము, విలువైన వస్తువులు లేకపోవడంతో అతడిపై కాల్పులు జరిపి పరారయ్యారని బాధితుడి తాత ఫమ్మాన్‌ సింగ్‌ చెప్పారు. 

గాయపడిన స్థితిలో బల్జీత్‌ అవతార్‌ సింగ్‌కు ఫోన్‌ చేయగా, బాధితుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బల్జీత్‌ మరణించినట్టు వైద్యులు ప్రకటించారని సింగ్‌ తెలిపారు. ముగ్గురు నలుగురు దుండగులు బల్జీత్‌పై కాల్పులు జరిపారని చెప్పారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios