Asianet News TeluguAsianet News Telugu

కొడుకునుంచి విడాకులు అడిగిందని.. కోడలిపై ఎన్నారై మామ ఘాతుకం.. ఏం జరిగిందంటే...

కొడుకు నుంచి విడాకులు అడిగిందని కోడలిని అతి దారుణంగా హత్య చేశాడో మామ. 74 యేళ్ల ఆ ఎన్నారై వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

NRI uncle kill daughter-in-law for asking divorce from her son in California
Author
First Published Oct 7, 2022, 12:51 PM IST

కాలిఫోర్నియా : అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కుమారుడి నుంచి విడాకులు అడిగిందని.. కోడలిని సొంత మామ అతి కిరాతకంగా తుపాకీతో కాల్చి చంపాడు.  కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ జోస్ లో ఈ దారుణం జరిగింది. దీంతో హత్యకు పాల్పడిన 74 ఏళ్ల ఎన్నారై వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్రెస్నోలో ఉండే సితల్ సింగ్ దొసంఝూ కుమారుడితో గురుప్రీత్ కౌర్ దొసంఝూకు కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. కొన్నాళ్ళు వీరి కాపురం బాగానే కొనసాగింది. ఆ తర్వాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో గురుప్రీత్ కౌర్ భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. 

అప్పటి నుంచి అతనికి దూరంగా ఉంటుంది. శాన్ జోస్ లో ఉండే తన మేనమామ వద్ద ఉంటూ వాల్ మార్ట్ లో పనిచేస్తుంది. దీంతో తన కొడుకును వద్దనుకొని వెళ్లిపోయిన గురుప్రీత్ కౌర్ పై మామ సీతల్ సింగ్ కక్ష్య పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతమొందిచాలనుకున్నాడు. ఈ క్రమంలో గతవారం ఆమె పని చేసే శాన్ జోస్ లోని వాల్ మార్ట్ కి వెళ్ళాడు.  కోడలిని కలిసి.. నీతో మాట్లాడాలని బయటకు తీసుకువచ్చాడు. మామ, కోడలు కలిసి కింద ఉన్న పార్కింగ్ లాట్ కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు కోడలితో మాట్లాడిన తర్వాత.. తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఒక్కసారిగా ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు గురుప్రీత్ కౌర్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

ఫ్లిప్ కార్ట్ చేసిన తప్పుకు ఎగిరి గంతేసిన కస్టమర్.. ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే.. వచ్చింది చూసి.....

అప్పటికే ఆమె శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి.  ఆమె కింద పడిపోయిన తరువాత సీతల్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయాదు. ఇక చాలాసేపటి వరకు గురుప్రీత్ కౌర్  తిరిగి రాకపోవడంతో తోటి ఉద్యోగి ఒకరు కింద పార్కింగ్ లాట్ కి వెళ్లి చూశారు. అక్కడ ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో వెంటనే వాల్మార్ట్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. అలాగే గురుప్రీత్ కౌర్ మామకు కూడా ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించారు. దాంతో ఈ హత్యకు పాల్పడింది సీతల్ సింగ్ అని గుర్తించారు. ఆ తర్వాత అతడు నివాసముండే ఫ్రెస్నోకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో తన కుమారుడిని విడిచి వెళ్లినందుకే గురుప్రీత్ కౌర్ ను హత్య చేసినట్లు అంగీకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios