Asianet News TeluguAsianet News Telugu

ఎన్నారైలంతా కెసిఆర్ వెంటే : ఎన్నారై టి. ఆర్. యస్ యూకే

ఎన్నారై టి. ఆర్. యస్ యూకే  ఆద్వర్యం లో లండన్ లో నిర్వహించిన మీడియా సమావేశం లో తెలంగాణ రాష్ట్రం లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై, కెసిఆర్ అసెంబ్లీ రద్దు మరియు ముందస్తు ఎన్నికల పై  స్పందించారు.

NRI's support KCR
Author
UK, First Published Sep 8, 2018, 4:01 PM IST

ఎన్నారై టి. ఆర్. యస్ యూకే  ఆద్వర్యం లో లండన్ లో నిర్వహించిన మీడియా సమావేశం లో తెలంగాణ రాష్ట్రం లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై, కెసిఆర్ అసెంబ్లీ రద్దు మరియు ముందస్తు ఎన్నికల పై  స్పందించారు.  ఈ సమావేశం లో  ఎన్నారై టి.ఆర్.యస్ నాయకులు అనిల్ కూర్మాచలం, , ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ,కార్యదర్శులు సృజన రెడ్డి చాడ, సత్యమూర్తి చిలుముల, సంయుక్త కార్యదర్శి బండ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.
 
నాయకులు వివిధ అంశాలపై స్పందిస్తూ......ముందస్తు ఎన్నికలపై కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగిస్తున్నామని, తమతో పాటు ఎన్నారై సమాజం కూడా కెసిఆర్ నిర్ణయంపై సంతృప్తితో ఉందని, తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు ఏదైనా తెలంగాణ శ్రేయస్సుకోసమే ఆలోచిస్తాడని, ఎన్నారైలమంతా కెసిఆర్ వెంటే ఉన్నామని తెలిపారు.
 
టి.ఆర్.యస్ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ అని, నాడు రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, నేడు అదే స్పూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణంలో రెట్టింపు త్యాగాలు చేసి ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ నాయకత్వంలో నిర్మిస్తుందని తెలిపారు.
 
ముందస్తు ఎన్నికలపై కెసిఆర్ ఆదేశాల మేరకు, ఎలాగైతే గత 2014 సాధారణ ఎన్నికల నుండి ఎన్నో ఉప ఎన్నికల్లలో, స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఎన్నారై టి.ఆర్.యస్ యూకే ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొని టి.ఆర్.యస్ విజయానికి కృషి చేసిందో, రాబోయే ఎన్నికలల్లో సైతం లండన్ నుండి  ప్రత్యేక బృందంగా వచ్చి ప్రచారం చేసి కెసిఆర్ చెప్పినట్టు వందకు పైగా సీట్ల తో టి.ఆర్.యస్ పార్టీ మళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు పని చేస్తుందని తెలిపారు.నేడు ప్రపంచవ్యాప్తంగా 32 పైగా దేశాల్లో టి.ఆర్.యస్ ఎన్నారై శాఖలు ఏర్పడ్డాయని, ఎన్నారై కో- ఆర్డినేటర్ మహేష్ బిగాలతో చర్చించి యావాత్ ఎన్నారై తెరాస ఆద్వర్యం లో ప్రత్యేక ప్రచార ప్రణాలికను సిద్ధం చేసుకుంటామని తెలిపారు.
 
ఎన్నారైల సమస్యల పైన ముఖ్యంగా గల్ఫ్ సమస్యలు వాటి పరిష్కారానికి సూచనలతో, ఇతర దేశాల ఉన్న ఎన్నారై మిత్రులని సంప్రదించి, వివిధ దేశాల్లో ఉన్న సమస్యలని అడిగి తెలుసుకొని టీ.ఆర్.యస్ పార్టీ  మేనిఫెస్టో కమిటీకి ప్రత్యేక నివేదిక ఇస్తామని తెలిపారు.ఇక రాబోయే రోజుల్లో వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించడమే కాకుండా, వినూత్నంగా టి.ఆర్.యస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తూ కెసిఆర్ నాయకత్వ అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు..ప్రతిపక్షాలకు ఘాటైన విమర్శ - ప్రతిస్పందన ఉంటుందని, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కెసిఆర్ మాస్టర్ స్ట్రోక్ కి మతిస్థిమితం కోల్పోయినట్టు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువ ఎంఎల్ఏ అభ్యర్థులు తక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి సన్నద్దం కావాలని, గాంధీ భవన్ లో కూర్చొని ఇంకా విమర్శించుకుంటూ ఉంటే మళ్ళి కెసిఆర్ ప్రమాణస్వీకారం కూడా అయిపోతుందని ఎద్దేవా చేశారు.


ఇటీవల టి.ఆర్.యస్ పార్టీ ఏర్పాటు చేసిన "ప్రగతి నివేదన సభ",  "ప్రజా ఆశీర్వాద సభ" లను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
అలాగే అన్ని తానై పని చేసిన కే.టీ.ఆర్, హరీష్ రావు టి.ఆర్.యస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారని తెలిపారు.చివరిగా, కెసిఆర్ ప్రకటించిన 105 అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సమావేశంలో ఎన్నారై టి.ఆర్.యస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ,కార్యదర్శులు సృజన రెడ్డి చాడ, సత్యమూర్తి చిలుముల, సంయుక్త కార్యదర్శి బండ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios