ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ బీర్లు... రుచి చూశారా..?
ఈ రెస్టారెంట్లో భారత సినిమాలకు సంబంధించి పోస్టర్లు, ప్రపంచ నాయకులు, భారత సినీ ప్రముఖుల ఫోటోలను రెస్టారెంట్ గోడలపై అలంకరించారు. కాగా ఇటీవల కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి పేర్లను బీర్లకు నామకరణం చేశాడు.
బీరు తాగే అలవాటు చాలా మందికి ఉండి ఉండొచ్చు. మీలో చాలా మంది చాలా రకాల బీర్లు రుచి చూసి ఉండొచ్చు. అయితే.. ఆర్టికల్ 370బీర్, ఆర్టికల్ 35 ఏ బీర్ ని రుచి చూశారా..? రుచి సంగతి పక్కన పెట్టండి అసలు ఇలాంటి పేర్లతో ఉన్న బీర్ల గురించి విన్నారా..? అసలు ఇలాంటి బీర్లు ఎక్కడైనా ఉంటాయా అని అనుకుంటున్నారా? నిజంగానే ఉన్నాయి. ఫిలిప్పీన్స్ లోని ఓ రెస్టారెంట్ లో ఈ బీర్లు చాలా ఫేమస్.
దేశం మీద ఉన్న అభిమానాన్ని ఓ ప్రవాస భారతీయులు బీర్లకు ఇలాంటి పేర్లు పెట్టి చాటుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోకి చెందిన మైక్ దేవ్నానీ అనే వ్యక్తి 40 ఏళ్ల క్రితం ఫిలిప్పీన్స్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ‘మదరిండియా’ పేరుతో ఒక రెస్టారెంటును స్థాపించారు. ఫిలిప్పీన్స్‌లో ఏంజెల్స్ సిటీలో ఇతడి రెస్టారెంట్ ఉంటుంది. తొలుత గార్మెంట్స్ సేల్స్ పర్సన్‌గా ఉద్యోగం చేసిన దేవ్నానీ.. కాస్త స్థిరపడగానే ‘మదరిండియా’ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.
ఈ రెస్టారెంట్లో భారత సినిమాలకు సంబంధించి పోస్టర్లు, ప్రపంచ నాయకులు, భారత సినీ ప్రముఖుల ఫోటోలను రెస్టారెంట్ గోడలపై అలంకరించారు. కాగా ఇటీవల కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి పేర్లను బీర్లకు నామకరణం చేశాడు.
పేర్లను బీర్లకు వివాదంకోసమో, ప్రచారం కోసమో పెట్టలేదంటున్నాడు దేవ్నానీ. బీర్‌పై ఉన్న ఈ పేరును చూడగానే దీని గురించి కొందరు అడుగుతారని, అప్పుడు మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పవచ్చనేది ఆయన ఉద్దేశమట.. ఆయనకు 20ఏళ్ల వయసున్నప్పుడు ఫిలిప్పీన్స్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి ఇండియన్ పాస్‌పోర్ట్‌ను తన వద్దే ఉంచుకున్నాడట. అప్పటి నుంచి స్వదేశానికి రాలేదు. భారత్‌లో తన బంధువులు ఎవరూ లేరని, అందుకే భారత్‌కు వచ్చే అవసరం లేకపోయిందని అంటున్నాడు.