ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి: అంత్యక్రియల ఫోటోలతో భార్య బాగోతం వెలుగులోకి..?

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ ఎన్ఆర్ఐ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇందులో వివాహేతర సంబంధం కోణం వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు

nri man mysterious death in east godavari district ksp

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ ఎన్ఆర్ఐ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇందులో వివాహేతర సంబంధం కోణం వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం పెంటకోట గ్రామానికి చెందిన వంకా సురేశ్‌కు తునికి చెందిన ప్రమీలకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. సురేశ్ జపాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే కరోనా కారణంగా ఆయన భారత్‌కు వచ్చి గత నాలుగు నెలలుగా భార్యతో కలిసి తునిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో సురేశ్ కొద్దిరోజుల క్రితం సురేశ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

తన భర్త గుండెపోటుతో మరణించాడని ప్రమీల బంధువులకి చెప్పడంతో వారు అంత్యక్రియలు చేశారు. అయితే అంత్యక్రియలు ముగిసిన రెండు రోజుల తర్వాత కుటుంబ సభ్యులు అంత్రక్రియలకు సంబంధించిన ఫొటోలు చూస్తుండగా షాక్‌కు గురయ్యారు.

సురేశ్‌ మృతదేహంపై కొన్ని గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు తుని పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సురేశ్‌ భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అందుకే తన తమ్ముడిని చంపేసిందని సురేశ్‌ సోదరుడు ఆరోపించాడు.

హత్యకు అత్తామామలు కూడా సహకరించారని సురేశ్‌ సోదరుడు వంకా జగన్నాథం ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే సురేశ్‌ భార్యే తమ కుమారుడని హత్య చేసిందని తల్లిదండ్రులు ఆరోపించారు.

కేసు నమోదు చేసిన దీంతో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios