గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఎన్నారై కదా అని కూతురిని ఇస్తే అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. గుంటూరు జిల్లాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్న ఎన్నారై యువకుడు శోభనానికి ముహూర్తం పెట్టేసరికి నాలుగైదు రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు.

పెళ్లి సందర్భంగా అతనికి రూ.50 లక్షల కట్నం, 75 సవర్ల బంగారం కూడా పెట్టారు. సామాన్య కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తమ కూతురిని ఎన్నారైకి ఇచ్చి వివాహం చేశారు.  వివాహం కూడా మహా ఘనంగా చేశారు. శోభనానికి ముహూర్తం పెట్టారు. అయితే, అతను తప్పించుకుని తిరుగుతున్నాడు.

ఆ విషయంపై వధువు అతన్ని నిలదీసింది. దాంతో అతను అసలు విషయం చెప్పాడు. అది విన యువతి బిత్తరపోయింది. తాను గేను అని అమెరికాలో మిత్రుడితో సహజీవనం చేస్తున్నానని చెప్పాడు. తనకు లైంగిక శక్తి లేదని చెప్పాడు.. దాంతో యువతి విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.

తల్లిదండ్రులు యువకుడిని కుటుంబాన్ని ప్రశ్నించారు దాంతో యువకుడి కుటుంబ సభ్యులు వారిపై దాడికి దిగారు. తాను కాపురం చేయలేనని అతను వధువుకి చెప్పాడు. పైగా తన మిత్రుడితో శోభనం చేయించుకోవాలని అతను వధువుతో చెప్పాడు. అదనపు కట్నం కోసం ఒత్తిడి పెట్టాడు. శోభనం రోజు నరకం చూపించాడు భాస్కర్ అనే ఆ యువకుడు. తనతో పాటు అమెరికాకు వచ్చి తన స్నేహితుడితో శోభనం చేయించుకోవాలని చెప్పాడు. 

ఈ విషయం ఎవరికైనా చెప్తే అంతు చూస్తానని బెదిరించాడు. విషయం బయటకు రావడంతో భాస్కర్ పరారయ్యాడు. అతను అమెరికాకు వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. లాక్ డౌన్ ఉండగా అమెరికాకు ఎలా వెళ్లాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.