Asianet News TeluguAsianet News Telugu

ఎన్ఆర్ఐ కి యూఏఈ గోల్డెన్ వీసా..!

అస్సాం కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వేదాంత బారువాకు ఈ వీసా లభించింది.  ఇన్వెస్ట‌ర్ కేట‌గిరీలో బారువాకు గోల్డెన్ వీసా ల‌భించింది.

NRI entrepreneur Vedanta Baruah first Assamese to get UAE''s Golden Visa
Author
hyderabad, First Published Jun 26, 2021, 2:38 PM IST

భారత సంతతికి చెందిన ఓ ఎన్ఆర్ఐ కి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. అస్సాం కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వేదాంత బారువాకు ఈ వీసా లభించింది.  ఇన్వెస్ట‌ర్ కేట‌గిరీలో బారువాకు గోల్డెన్ వీసా ల‌భించింది. దీంతో గోల్డెన్ వీసా పొందిన మొదటి అస్సామీగా బారువా రికార్డుకెక్కారు. 

ఆయ‌న స్వ‌స్థ‌లం అస్సాంలోని డిబ్రుగఢ్ జిల్లా. బారువా.. బెర్న్స్ బ్రెట్ మసౌద్ ఇన్సూరెన్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఈ సంస్థ‌కు యూకే, ఈయూ, భార‌త్‌లో బ్రాంచీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది.

 “ఇది నాకు నిజంగా గ‌ర్వించ‌ద‌గిన స‌మ‌యం. యూఏఈ ప్రభుత్వానికి, ఆర్థికాభివృద్ధి శాఖకు నా కృతజ్ఞతలు. ఎంతో ఆనందంగా ఉంది”అని బారువా అన్నారు. కాగా, యూఏఈ ప్రభుత్వం 2019లో ఈ ప్రత్యేక వీసా విధానాన్ని తీసుకొచ్చింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన‌ విదేశీయులు యూఏఈలో నివసించడానికి, పని చేయడానికి, అధ్యయనం చేయడానికి వీలుగా దీన్ని అమలు చేస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios