బెజవాడ కనకదుర్గమ్మకు అమెరికాలో స్ధిరపడ్డ ప్రవాసాంధ్రుడు వెండి సామాగ్రి బహూకరించారు. కూచిబోట్ల సూర్యప్రకాశ్, శ్రీరమణి దంపతులు ప్రతి రోజు వాడుకు నిమిత్తం 3.75 గ్రాముల బరువున్న వెండి గిన్నెలు, ప్లేట్లు, మూతలు వివిధ సైజుల్లో చేయించారు. వీటి విలువ సుమారు రూ.75 వేలు.

వీటిని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ దంపతులకు అధికారులు అమ్మవారి దర్శనం చేయించి వేదపండితులతో ఆశీర్వాదం ఇప్పించారు. అనంతరం దుర్గమ్మ చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.