చందమామపైకి ఇండో అమెరికన్ రాజాచారి

దీనికోసం 18వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా కేవలం 11 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరిలో శిక్షణ పూర్తి అయింది.

NASA Selects Indian-American Astronaut Raja Chari For Manned Mission To Moon

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2024లో చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపనున్నది. నాసా అర్టెమిస్‌ ప్రోగ్రామ్‌ పేరుతో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నది. ఇందుకోసం 18 మంది వ్యోమగాములను ఎంపికచేసింది. ఈ జాబితాలో హైదరాబాద్‌ మూలాలున్న రాజాచారి (41) చోటు దక్కించుకున్నారు. అంతే కాకుండా నాసా ప్రత్యేకంగా బేసిక్‌ ఆస్ట్రోనాట్‌ శిక్షణ ఇచ్చిన 11 మందిలో రాజాచారి ఒకరు కావడం విశేషం. 

2017లో నాసా ఈ శిక్షణ ప్రారంభించింది. దీనికోసం 18వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా కేవలం 11 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరిలో శిక్షణ పూర్తి అయింది. ఈ 18 మందికి అడ్వాన్స్‌డ్‌ శిక్షణ ఇవ్వనున్నారు. రాజాచారి తండ్రి శ్రీనివాస్‌ హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. 

అమెరికాలోని వాటర్‌లూలో నివసిస్తున్న రాజాచారి మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుం చి ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశారు. ప్రస్తు తం ఆయన 461 ఫ్లైట్‌ టెస్ట్‌ స్కాడ్రన్‌లో కమాండర్‌గా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లోని ఎఫ్‌-35 ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ ఫోర్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ఆకాశంలోనే కాదు జాబిల్లి యాత్రలో కూడా మహిళలు సగమనేలా ఈదఫా బృందంలోని మొత్తం 18 ఆస్ట్రోనాట్లలో తొమ్మిది మంది మహిళలే ఉన్నారు. అంతేకాదు ఈ సారి చంద్రుడిపైన తొలుత ఒక మహిళే కాలు మోపుతుంది. ఆ తర్వాతే బృందంలో మిగిలిన వారు అడుగు పెడతారు. 

గత ఏడాది మొదటి సారిగా స్పేస్‌ వాక్‌ చేసిన క్రిస్టినా కొచ్, జెస్సికా మీర్‌లు మూన్‌ మిషన్‌లో కూడా ఉన్నారు. ఇక ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆస్ట్రోనాట్‌ పాట్‌ ఫారెస్ట్‌ తమ ఆనందానికి హద్దుల్లేవని అన్నారు. చంద్రుడిపైకి వెళతామన్న ఊహ ఎంతో ఉద్వేగానికి గురి చేస్తోందని చెప్పారు. చంద్రుడిపై అటూ ఇటూ చక్కెర్లు కొట్టాలన్న  కల నిజం కాబోతోందని, అందరికీ దక్కిన అపూర్వమైన గౌరవమిదని ఆయన చెప్పారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios