Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో నల్ల జాతీయుడి కాల్పులు: నల్గొండ జిల్లాకు చెందిన టెక్కీ మృతి

అమెరికాలో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో నల్గొండ జిల్లాకు చెందిన టెక్కీ నక్క సాయిచరణ్ మృతి చెందాడు., ఈ విషయమై నల్గొండ జిల్లాలో ఉన్న పేరేంట్స్ కు సమాచారం అందించారు. 

Nalgonda Man Shot Dead in USA
Author
Nalgonda, First Published Jun 22, 2022, 9:24 AM IST

వాషింగ్టన్: USA లో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో ఉమ్మడి Nalgonda జిల్లా వాసి మృతి చెందాడు. స్నేహితుడిని Airportలో డ్రాప్ చేసి వస్తున్న సమయంలో Black Man జరిపిన Firing నల్గొండ జిల్లాకు చెందిన Nakka Sai Charanమృతి చెందాడు.రెండేళ్లుగా సాయి చరణ్ అమెరికాలో టెక్కీగా పనిచేస్తున్నాడు. సాయిచరణ్ ప్రయాణీస్తున్న కారుపై దుండగుడు జరిపిన కాల్పుల్లో సాయిరణ్ అక్కడికక్కడే మరనించారు. సాయి చరణ్ మరణించిన విషయమై కుటుంబ సభ్యులకు అమెరికా నుండి అధికారులు సమాచారం ఇచ్చారు. 

నల్లజాతీయుడు జరిపిన కాల్పుల తర్వాత యూనివర్శిటీ ఆప్ మేరీల్యాండ్  ఆడమ్స్ కౌలీషాక్ ట్రామా సెంటర్ కు తరలించారు. కొద్దిసేపు చికిత్స  తర్వాత సాయి చ రణ్ మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. సాయి చరణ్ తలపై తుపాకీ గాయం ఉందని వైద్యులు చెప్పారు.

గతంలో కూడా అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో పలువురు ఇండియన్లు మరణించిన విషయం తెలిసిందే. 2021 మే 26న  కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల్లో ఓ భారత సంతతి వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.  ఈ కాల్పుల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు.  అందులో భారత సంతతికి చెందిన 36ఏళ్ల తప్తేజ్‌దీప్ సింగ్ కూడా ఉన్నారని అక్కడి మీడియా పేర్కొంది. 

సాంటా క్లారా వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాధికార సంస్థ నేతృత్వంలో నడిచే యార్డులో భారత సంతతికి చెందిన తప్తేజ్‌దీప్ సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తప్తేజ్‌దీప్ సింగ్ ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్లారు.   ఉదయం ఏడు గంటల సమయంలో అకస్మాత్తుగా అతని సహోద్యోగి కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో తప్తేజ్‌దీప్ సింగ్‌తోపాటు అతనితో పని చేసే మరికొంత మంది ఉద్యోగులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

 ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడ్డ దుండగుడిని హతమార్చినట్టు తెలుస్తోంది. తప్తేజ్‌దీప్ సింగ్ మృతి పట్ల అతని సహోద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు. కాల్పుల సమయంలో తప్తేజ్‌దీప్ సింగ్.. ఇతరులను రక్షించే ప్రయత్నం చేసినట్టు యార్డులో పని చేసే ఓ ఉద్యోగి తెలిపాడు. అంతేకాకుండా తప్తేజ్‌దీప్ సింగ్‌ను హీరోగా అభివర్ణించాడు.  తప్తేజ్‌దీప్ సింగ్ ఇండియాలో జన్మించినప్పటికీ కాలిఫోర్నియాలో పెరిగారు. అతనికి భార్య, మూడేళ్ల కుమారుడితోపాటు ఏడాది పాప ఉన్నారు. 

2020 డిసెంబర్ 21న  అమెరికాలో  నివసిస్తున్న హైద్రాబాద్‌ వాసిపై కాల్పులు జరిగాయి. హైద్రాబాద్ కు చెందిన మహ్మద్ ముజీబుద్దీన్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముజీబుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.

 ముజీబుద్దీన్ ను షికాగోలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల విషయాన్ని హైద్రాబాద్ లోని ఆయన కుటుంబానికి సమాచారం అందించారు ముజీబుద్దీన్ కు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై ఇండియన్ ఎంబసీ, ఇండియన్ కాన్సులేట్లకు లేఖ రాశారు.  ముజీబ్ పై కాల్పులు జరిపిన విషయం తెలుసుకొన్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముజీబ్ పై ఎవరు కాల్పులు జరిపారు,. ఎందుకు జరిపారనే విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios