ఫిలిప్పీన్స్ లో తెలంగాణ విద్యార్థి మణికాంత్ రెడ్డి అనుమానాస్పద మృతి.. పోస్టు మార్టం రిపోర్టులో ఏముందంటే...
ఫిలిప్పీన్స్ లో మృతి చెందిన వైద్య విద్యార్థి పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. అతని మృతి కార్డియాక్ అరెస్ట్ వల్లే అయిందని పోలీసులు చెబుతున్నారు.
భూదాన్ పోచంపల్లి : ఫిలిప్పీన్స్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలానికి చెందిన మణికాంత్ రెడ్డి మృతి కేసులో పోస్టుమార్టం నివేదిక వచ్చింది. మండలంలోని రామలింగంపల్లి గ్రామానికి చెందిన 21 సంవత్సరాల వైద్య విద్యార్థి గూడూరు మణికాంత్ రెడ్డి మృతికి కారణం వైద్యులు పోస్టుమార్టంలో తేల్చారు.
ఈనెల 23వ తేదీన ఫిలిప్పీన్స్ లో డాక్టర్ చదువుతున్న మణికాంత్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం నాడు ఫిలిప్పీన్స్ లోని డాక్టర్ల బృందం మణికాంత్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కార్డియాక్ అరెస్ట్ వల్లే అతడు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మణికాంత్ రెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులకు ఈ మేరకు అక్కడి అధికారులు సమాచారం అందించారు.
తల రెండు ముక్కలు: ఏలూరులో భార్యను హత్య చేసిన భర్త
అతని మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మణికాంత్ రెడ్డి మృతదేహం హైదరాబాదుకు చేరుకోనుందని తెలుస్తోంది.