Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం.. హైదరబాదీని చంపిన పాకిస్తానీ

హైదరాబాద్ కి చెందిన నదీమ్ ఉద్దీన్ హమీద్, పాక్ కి  చెందిన పెర్విజ్ ఉద్యోగ రీత్యా లండన్ లో స్థిరపడ్డారు. వీరిద్దరూ లండన్ లో ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. కాగా... నదీమ్... తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పెర్విజ్ అనుమానపడ్డాడు. ఈ క్రమంలో పదునైన కత్తితో పొడిచి హత్య చేశాడు. 

Man jailed for life for murder of Indian-origin supermarket worker in UK
Author
Hyderabad, First Published Sep 13, 2019, 10:28 AM IST

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో హైదరాబాద్ కి చెందిన వ్యక్తిని పాకిస్తాన్ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకోగా... నిందితుడికి లండన్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ కి చెందిన నదీమ్ ఉద్దీన్ హమీద్, పాక్ కి  చెందిన పెర్విజ్ ఉద్యోగ రీత్యా లండన్ లో స్థిరపడ్డారు. వీరిద్దరూ లండన్ లో ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. కాగా... నదీమ్... తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పెర్విజ్ అనుమానపడ్డాడు. ఈ క్రమంలో పదునైన కత్తితో పొడిచి హత్య చేశాడు. 

వారిద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని చెప్పినా వినకుండా అతను నదీమ్ ని హత్య చేశాడు. ఈ క్రమంలో న్యాయస్థానం అతనికి తాజాగాశిక్ష విధించింది. పెరోల్‌ దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 22 సంవత్సరాల శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. పదునైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు మరో 18 నెలల శిక్ష కూడా విధించింది. యావజ్జీవ శిక్షతో పాటే దీన్ని కూడా అనుభవించాలని పేర్కొంది. ‘మీ భార్య, కుటుంబ సభ్యులు, మరణించిన మొహమ్మద్‌లు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని ఎంత చెప్పినా వినలేదు’ అని తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ ఏడాది మేలో ప్రజలు చూస్తుండగానే పెర్విజ్‌ హైదరాబాద్‌కు చెందిన తన సహోద్యోగి నదీమ్‌ ఉద్దీన్‌ హమీద్‌ మొహమ్మద్‌ (24)ను లండన్‌కు సమీపంలో పొడిని చంపాడు. మొహమ్మద్‌ చనిపోయే నాటికి అతడి భార్య అఫ్సా ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మొహమ్మద్‌ను కిరాతకంగా చంపాడని మృతుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios