అమెరికాలోని వైట్ హౌస్ వద్ద ఓ ఎన్ఆర్ఐ సజీవదహనానికి పాల్పడ్డాడు. కాగా... ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు భారత్‌కు చెందిన అర్నవ్‌ గుప్తా(33)గా పోలీసులు గుర్తించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. మేరీలాండ్‌లో నివసిస్తున్న ఆర్నవ్‌ గుప్తా బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వచ్చాడు. చాలా సమయం గడిచినా అతడు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా.. శ్వేతసౌధానికి సమీపంలో ఉన్న ఎలిప్స్‌ పార్కు వచ్చిన ఆర్నవ్‌.. అక్కడ అందరూ చూస్తుండగానే తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీంతో షాక్‌ తిన్న స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే శరీరంలోని అన్ని అవయవాలు తీవ్రంగా కాలిపోవడంతో అర్నవ్‌ మృతిచెంచినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆర్నవ్‌ ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.