ఫ్లోరిడాలో దారుణం.. భర్త చేతిలో కేరళ యువతి దారుణ హత్య
నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేందుకు కారు పార్కింగ్ గ్రౌండ్‌కు వెళ్లింది. పార్కింగ్ నుంచి కారు తీసేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో పలుమార్లు పొడిచి మరీ చంపేశాడు. కాగా.. తొలుత గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా భావించిన పోలీసులు.. తర్వాత దర్యాప్తులో భర్తే నిందితుడని తేల్చారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తివివరాల్లోకి వెళితే..కేరళ రాష్ట్రం కొట్టాయంలోని పిర్వంకు చెందిన మెరిన్ జాయ్ (26)... దక్షిణ ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్‌లో గల బ్రోవార్డ్ హెల్త్ హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తోంది. మంగళవారం నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేందుకు కారు పార్కింగ్ గ్రౌండ్‌కు వెళ్లింది. పార్కింగ్ నుంచి కారు తీసేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
రక్తపు మడుగులో పడి ఉన్న జాయ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన కోరల్ స్ప్రింగ్స్ పోలీసులకు జాయ్‌ను ఆమె భర్త ఫిలిప్ మాథ్యూనే హతమార్చినట్లు తెలుసుకున్నారు. దాంతో ఫిలిప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ గొడవల కారణంగానే భార్యను హత్య చేసినట్లు మాథ్యూ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.