అమెరికా రోడ్లపై ఇండియన్ దాబా: ఆనంద్ మహీంద్రా సలహా ఇదే..
దేశంతో పాటు ప్రపంచంలోని సమకాలీన రాజకీయ అంశాలపై స్పందించే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అమెరికా వ్యోమింగ్‌లోని ట్రక్ స్టాప్‌లో రోడ్డు పక్కనవున్న దాబాపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
దేశంతో పాటు ప్రపంచంలోని సమకాలీన రాజకీయ అంశాలపై స్పందించే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అమెరికా వ్యోమింగ్‌లోని ట్రక్ స్టాప్‌లో రోడ్డు పక్కనవున్న దాబాపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
మహీంద్రా గ్రూపులోని ఉన్నతాధికారి ట్వీట్ చేసిన ఒక వీడియోలో... సదరు దాబా అమెరికాలోని భారతీయులకు, అక్కడి స్థానికులకు ఆహారాన్ని అందిస్తోంది.
సాధారణంగా రోడ్ల మీద దాబాల్లో భారతీయులు మాత్రమే రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారని.. ఇప్పుడు యూఎస్‌లోని వ్యోమింగ్ హైవేపే మొట్టమొదటి దాబాను ప్రారంభించారని మహీంద్రా ఇన్నోవేషన్ అకాడమీ ఛైర్మన్ ఎస్పీ శుక్లా ట్వీట్ చేశారు. త్వరలోనే ఇది గ్లోబల్ దాబాగా ప్రసిద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు.
దీని పట్ల స్పందించిన ఆనంద్ మహీంద్రా... మహీంద్రా ట్రక్, బస్సును ట్యాగ్ చేశారు. ఈ మనోహరమైన దానిని పంచుకున్నందుకు శుక్లాకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా దీనిని రవాణా అవార్డులో బెస్ట్ దాబా అవార్డుగా ఎందుకు మార్చకూడదని ఆనంద్ ప్రశ్నించారు.
ఈ దాబాను సిక్కు ట్రక్కర్ మింటు పాంధర్ నడుపుతున్నాడు. దాబాల వద్ద రుచికరమైన ఆహారాన్ని తినే భారతీయుల అనుభవాన్ని అమెరికన్లు కూడా ఆస్వాదించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇతని వంటగదిలో తాజా పసుపు, కొత్తిమీర కూరగాయాలతో పాటు భారతీయులు ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. అన్నట్లు ఈ దాబాలో భారతీయుల ఫేవరేట్ వంటకాలైన పాలక్ పన్నీర్, సాగ్, పన్నీర్ మఖానీ, దాల్ మఖానీ దొరుకుతోంది.