ఐర్లాండ్‌: శవాలుగా తేలిన భారతీయ మహిళ, ఇద్దరు పిల్లలు

ఐర్లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది. మన దేశానికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు శవాలుగా తేలారు

Karnataka Woman, Her 2 Children Found Dead In Ireland ksp

ఐర్లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది. మన దేశానికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు శవాలుగా తేలారు. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని పెరియపట్న తాలూకా హడగనహళ్లికి చెందిన 37 ఏండ్ల సీమా బాను భర్త సయ్యద్ సమీర్ ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.

దీంతో వారి కుటుంబం ఏడు నెలల కిందట ఆ దేశానికి వెళ్లింది. దక్షిణ డబ్లిన్‌లోని బల్లింటీర్‌లో సయ్యద్ భార్యా పిల్లలతో నివసిస్తున్నారు. అయితే అక్టోబర్‌ 28న సీమా బాను, ఆమె ఇద్దరు పిల్లలు అస్ఫిరా (11), ఫైజాన్ సయ్యద్ (7) అనుమానాస్పద స్థితిలో మరణించారు.

స్థానిక పోలీసులు ఈ సమాచారాన్ని కర్ణాటకలోని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. మరోవైపు భారత్‌కు చెందిన ముగ్గురి మరణంపై ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబ సభ్యులకు, స్థానిక పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది.  ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios