ఇజ్రాయెల్: భారతీయ నర్స్ సౌమ్య సంతోష్‌కు అరుదైన గౌరవం
ఇటీవల ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరిగిన రాకెట్ దాడుల్లో సౌమ్య సంతోష్ అనే భారతీయ నర్సు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణం పట్ల ఇజ్రాయెల్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. స్వయంగా దేశాధ్యక్షుడు రెవెన్ రివ్లిన్ కేరళలోని సౌమ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.

తాజాగా, సౌమ్య సంతోష్‌కు మరణానంతరం గౌరవ పౌరసత్వం అందించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించింది. సౌమ్య సంతోష్ తమ దేశ గౌరవ పౌరురాలు అని ఇజ్రాయెల్ ప్రజలు భావిస్తున్నారని, ఆమెను తమలో ఒకరిగా చూసుకోవాలనుకుంటున్నారని భారత్ లోని ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి రోరీ యెడీడియా పేర్కొన్నారు.
Also Read:భర్తతో వీడియో కాల్.. దూసుకొచ్చిన రాకెట్: ఇజ్రాయెల్‌లో కేరళ మహిళ మృతి
మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళలోని సౌమ్య సంతోష్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. తన భార్యకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తామని ఆమె భర్త సంతోష్ తెలిపారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం అధికారులు తమకు సమాచారం అందించారని వారు వెల్లడించారు. తమ కుమారుడు అడోన్ బాధ్యతలను కూడా ఇజ్రాయెల్ స్వీకరిస్తుందని వారు భరోసా ఇచ్చారని సంతోష్ చెప్పారు.
కాగా, సౌమ్య మరదలు షెర్లీ బెన్నీ కూడా ఇజ్రాయెల్ లోనే పనిచేస్తున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, సౌమ్యను ఇజ్రాయెల్ ప్రజలు ఓ దేవతగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె ప్రాణత్యాగాన్ని గౌరవించాలని వారు నిర్ణయించుకున్నారని వెల్లడించారు. విదేశాల్లో మరణించిన ఓ భారత జాతీయురాలికి లభించిన గొప్పగౌరవం ఇదని షెర్లీ హర్షం వ్యక్తం చేశారు.