Asianet News TeluguAsianet News Telugu

సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో భారతీయ తల్లీకూతుళ్లు.. రంగోలి వేసి రికార్డ్స్ లోకి..

సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఓ భారతీయ తల్లీకూతుళ్లు స్థానం దక్కించుకున్నారు. తమిళ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేసిన రంగోలికి ఈ గౌరవం దక్కింది. 

Indian Woman and Daughter Enters Singapore Book Of Records with their Rangoli - bsb
Author
First Published Jan 27, 2023, 12:42 PM IST

సింగపూర్ : సింగపూర్‌లోని ఒక భారత్ కు చెందిన ఓ తల్లికూతుర్లు సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. వీరు 26,000 ఐస్‌క్రీమ్ స్టిక్‌లను ఉపయోగించి 6-6 మీటర్ల రంగోలి కళాఖండాన్ని రూపొందించారు. 2016లో సింగపూర్‌లో 3,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో రంగోలీని రూపొందించి రికార్డు బుక్‌లో నమోదయ్యారు. సుధా రవి, తన కుమార్తె రక్షితతో కలిసి గత వారం లిటిల్ ఇండియా ఆవరణలో జరుగుతున్న పొంగల్ సంబరాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో రంగోలిని ప్రదర్శించారు.

ఈ రంగోలిని వేయడానికి ఒక నెల సమయం పట్టింది, ప్రముఖ తమిళ పండితుడు-కవులు తిరువళ్లువర్, అవ్వైయార్, భారతియార్, భారతిదాసన్ ల చిత్రాలు వీరు వేశారు. సింగపూర్‌లోని తమిళ సాంస్కృతిక సంస్థ కళామంజరి, లిటిల్ ఇండియా షాప్ కీపర్స్, హెరిటేజ్ అసోసియేషన్ (LISHA) వేడుకల్లో ఇది ప్రదర్శించబడింది. 

శుక్రవారం తబలా వారపత్రికలో జనవరి 21న జరిగిన కార్యక్రమంలో వయోలిన్, మృదంగం కళాకారులు కర్ణాటక సంగీతం, కవుల రచనలను కొనియాడుతూ.. వారి పాటలతో ప్రేక్షకులను అలరించారు. "కళామంజరి, బృందం ఈ పండితుల పాటలపై గాత్ర ప్రదర్శన చేసారు" అని సంగీతం, నృత్యం ద్వారా తమిళ సాహిత్య రచనలను ప్రోత్సహించే కళామంజరి వ్యవస్థాపకుడు సౌందర నాయకి వైరవన్ అన్నారు.

సోమాలియాలో అమెరికా దాడులు.. ఐఎస్ఐఎస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుడానీ హతం..

తమిళ సంస్కృతిని చురుగ్గా ప్రచారం చేసే రంగోలి నిపుణురాలైన సుధారవి.. సాధారణంగా రంగోలీ వేయడానికి బియ్యం పిండి, సుద్ద, చాప్‌స్టిక్‌లను ఉపయోగిస్తారు. అయితే ఈసారి ఐస్‌క్రీం స్టిక్‌లపై యాక్రిలిక్‌లకు మారారు. కమ్యూనిటీ సెంటర్లలో రంగోలిలను వేయడంలో ఆమె ప్రసిద్ధి చెందారు. అలా ఆమె సింగపూర్‌లోని భారతీయులను, అభిమానుల దృష్టిని ఆకర్షించారు.

"సుధ, ఆమె కుమార్తె సింగపూర్‌లో తమిళ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగం,  యువ తరం మన సంప్రదాయాలను ముందుకు తీసుకువెడతారనడానికి ఇది ఉదాహరణ’’ అని తమిళ భాష,  సంస్కృతికి సంబంధించిన ప్రముఖుడు సౌందర వైరవన్ అన్నారు. ఆహారం, పానీయాల వ్యాపారాన్ని నడుపుతున్న రజినీ అశోకన్, రంగోలిని చూసి విస్మయం చెందారు, ఈవెంట్‌లో ఇధి అత్యుత్తమ హైలైట్ అని, భారతీయ సంస్కృతికి గర్వపడేలా చేసిందని అన్నారు.

'ఎల్ఐఎస్హెచ్ఏ పొంగల్ ఫెస్టివల్ 2023'లో భాగంగా ఎల్ఐఎస్హెచ్ఏమద్దతుతో కళామంజరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Follow Us:
Download App:
  • android
  • ios