అమెరికాలో రోడ్డు ప్రమాదం: భారతీయ టెక్కీ, కూతురు దుర్మరణం
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ వైద్యుడు, ఆయన రెండేళ్ల చిన్నారి దుర్మరణం పాలయ్యారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ వైద్యుడు, ఆయన రెండేళ్ల చిన్నారి దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బీదర్ జిల్లా భాల్కి తాలుకా కొంగళ్లికి చెందిన ముఖేశ్ అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం తన భార్య మౌనిక, కుమార్తె దివిజాలతో కారులో వెళుతున్నారు. ముఖేశ్ శివాజీవార దేశ్‌ముఖ్ కారును డ్రైవ్ చేస్తుండగా... వారు వెనుక కూర్చొన్నారు. ఈ సమయంలో కారు అదుపుతప్పి ఓ ట్రక్‌ను ఢీకొట్టడంతో తండ్రీ కుమార్తెలు ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా.. మౌనిక పరిస్ధితి విషమంగా ఉంది.
మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చే విషయమై భారత రాయబార కార్యాలయంతో బీదర్ ఎంపీ భగవంత్ ఖోబా సంప్రదింపులు జరిపారు.