కెనడాలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జైశంకర్

కెనడాలో దుండగులు జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి మరణించాడు. ఈ విషయాన్ని టొరంటో పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మృతిచెందిన విద్యార్థిని 1 ఏళ్ల కార్తీక్ వాసుదేవ్ గుర్తించారు.

Indian Student Kartik Vasudev Shot Dead in Canada Jaishankar expresses condolences

కెనడాలో దుండగులు జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి మరణించాడు. ఈ విషయాన్ని టొరంటో పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఇండియాకు చెందిన 21 ఏళ్ల కార్తీక్ వాసుదేవ్ మీద షెర్బోర్న్ సబ్‌వే స్టేషన్ గ్లెన్ రోడ్ ప్రవేశ ద్వారం వద్ద కాల్పులు జరిగాయాని.. వైద్య సాయం అందించిన పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్పారు. ‘‘అతడికి అనేక తుపాకీ గాయాలు తగిలాయి. ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు’’ అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

కార్తీక్ వాసుదేవ్ కుటుంబం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ ప్రాంతంలో ఉంటోంది. కార్తీక్.. ఉన్నత విద్య కోసం కొద్ది నెలల క్రితమే కెనడాకు వెళ్లారు. టొరంటోలోని సెనెకా కాలేజీలో మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌ మొదటి సెమిస్టర్ చదువుతున్నారు. కార్తీక్ అతను పనిచేస్తున్న మెక్సికన్ రెస్టారెంట్‌కు వెళుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. 

ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సంఘటనతో బాధపడినట్టుగా చెప్పారు. కార్తీక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇక, కార్తీక్ కుటుంబంతో టచ్‌లో ఉన్నామని టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.

 

ఈ ఘటనపై కార్తీక్ చదువుతున్న సెనెకా కాలేజ్ యజమాన్యం విచారణం వ్యక్తం చేసింది. కార్తీక్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios