Asianet News TeluguAsianet News Telugu

కాలేజీలో కంప్యూటర్ డ్యామేజ్... చిత్తూరు విద్యార్థికి యూఎస్ లో జైలు శిక్ష

విశ్వనాథ్ కాలేజీలోని దాదాపు 66 కంప్యూటర్లు పాడు చేశాడు. కంప్యూటర్లు పాడుచేయాలనే ఉద్దేశంతో 66 కంప్యూటర్లలో యూఎస్బీ  కిల్లర్ డివైజ్ ని ఇన్సర్ట్ చేశాడు. 
 

Indian Student Gets A Year In Jail In US For Damaging College Computers
Author
Hyderabad, First Published Aug 14, 2019, 2:37 PM IST

కాలేజీలో కంప్యూర్ లు డ్యామేజ్ చేశాడనే కారణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి అమెరికాలో సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా 58, 471 డాలర్లు( ఇండియన్ కరెన్సీలో దాదాపు 41లక్షలు) జరిమానా కూడా విధించారు.

చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఆకుతోట(27) దూర విద్య నేపథ్యంలో స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లాడు. అక్కడ న్యూయార్క్ లోని ఓ యూనివర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. కాగా.. ఇటీవల విశ్వనాథ్ కాలేజీలోని దాదాపు 66 కంప్యూటర్లు పాడు చేశాడు. కంప్యూటర్లు పాడుచేయాలనే ఉద్దేశంతో 66 కంప్యూటర్లలో యూఎస్బీ  కిల్లర్ డివైజ్ ని ఇన్సర్ట్ చేశాడు. 

ఈ డివైజ్ ని కంప్యూటర్ లోని యూఎస్బీ పోర్టులో చేర్చినప్పుడడు కంప్యూటర్ లోని ఆన్ బోర్డ్ కెపాసిటర్లు వేగంగా ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా పదే పదే డిశ్చార్జ్ అయ్యలే ఒక ఆదేశాన్ని పంపతుతుంది. దాని వల్ల యూఎస్బీ పోర్టు, ఎలక్ట్రికల్ సిస్టమమ్ ఓవర్ లోడ్ అయ్యి అవి పాడౌతాయి. విశ్వనాథ్ ఫిబ్రవరి 14వ తేదీన ఇలా చేశాడు. కాగా... కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు అతనిని ఫిబ్రవరి 22వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ముందు హాజరుపరచగా... సంవత్సరం జైలు శిక్ష, జరిమానా విధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios