అమెరికాలో భారత విద్యార్థి ఒకరు మృతి చెందారు. నుహేల్ హబీబ్ అనే భారతీయ విద్యార్థి 2016 నుంచి అమెరికాలోని రోడ్ ఐలాంట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో  ఆదివారం కింగ్స్‌టన్ క్యాంపస్ టూటెల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద ఉన్న స్విమ్మింగ్ ఫూల్‌లో స్విమ్మింగ్ చేసేందుకు వచ్చాడు.

స్విమ్మింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అతనిని గమనించిన తోటి వారు హబీబ్‌ను బయటకి తీసి కృత్రిమ శ్వాస ఇవ్వడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే హబీబ్ మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని వర్సిటీ యాజమాన్యం ధ్రువీకరించింది.