ఇంగ్లాండ్ లో భారతీయ విద్యార్థి ఆత్మహత్య.. లాక్ డౌన్ లో పేరెంట్స్
దేశంకాని దేశంలో చదువు కోసం వెళ్లిన కొడుకు మృత్యువాత పడటం, లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేకపోవడం పుణేలో ఉన్న సిద్ధార్థ్ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
ఇంగ్లండ్‌లో భారత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుణెకు చెందిన సిద్ధార్థ్ ముర్కుంబి అనే 23 ఏండ్ల యువకుడు సెంట్రల్ లాంక్‌షైర్ యూనివర్శిటీలో మార్కెటింగ్ కోర్సు చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో మార్చి 15 నుంచి అతను కనిపించడకుండా పోయాడు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆదివారం రిబ్బల్ నది ఒడ్డున అతని మృతదేహాన్ని గుర్తించారు.
Also Read కరోనా దెబ్బ: బ్రిటన్ లో భారత సంతతి డాక్టర్ జితేంద్ర మృతి...
దేశంకాని దేశంలో చదువు కోసం వెళ్లిన కొడుకు మృత్యువాత పడటం, లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేకపోవడం పుణేలో ఉన్న సిద్ధార్థ్ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
తమ కొడుకు మృతదేహాన్ని భారత్‌కు పంపించాలని సిద్ధార్థ్ తండ్రి శంకర్ ముర్కుంబి ఇంగ్లండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత నెల మిస్సయిన సిద్ధార్థ్ ఇప్పుడు నది ఒడ్డున విగతజీవిగా కనిపించడంతో.. అతను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఇంగ్లండ్ పోలీసులు అనుమానిస్తున్నారు.