ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో కత్తి తో బెదిరించి ఒక మహిళపై అత్యాచారం చేసి దోచుకున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి  కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఐల్వర్త్ క్రౌన్ కోర్టులో అత్యాచారం, లైంగిక వేధింపులు మరియు దోపిడీకి పాల్పడిన కేసులో దిల్జీత్ గ్రెవాల్ దోషిగా కోర్టు తేల్చింది . 

అతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. విడుదలైన తర్వాత కూడా "లైసెన్స్" పై మరో ఐదేళ్ళు పర్యవేక్షణలో ఉండాలని తెలిపింది.  

ఈ ఏడాది ఏప్రిల్ లో బాధితురాలి ఇంటికి ఒక మీటింగ్ నిమిత్తం దీల్జీత్ వచ్చాడు. రాగానే కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేసాడు. దాదాపు రెండున్నరగంటలపాటు పాశవికంగా అత్యాచారం చేసాడు. ఆ తరువాత ఆమె ఫోన్ లాక్కున్నాడు. డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ ఇల్లంతా చిందర వందర చేసాడు. ఆమె హ్యాండ్ బాగ్ లో నుంచి డబ్బులు తీసుకొని పరారయ్యాడు.

అతను అక్కడినుండి వెళ్ళిపోయిన తరువాత  ఆ సదరు మహిళా వేరే ఫోన్ నుండి ఒక మిత్రుడికి కాల్ చేయగా ఆ మిత్రుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వచ్చి బాధితురాలైన ఆసుపత్రిలో చేర్చారు. 

"నేను ఈ శిక్షను స్వాగతిస్తున్నాను, ఇది బాధితురాలికి కొంతవరకు ఉపశమనం ఇస్తుందని ఆశిస్తున్నాను. మా దర్యాప్తుకు సహకరించి దాడి చేసిన వ్యక్తిని గుర్తించడంలో బాధితురాలు చేసిన ధైర్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని దర్యాప్తుకు నాయకత్వం వహించిన డిటెక్టివ్ కానిస్టేబుల్ మార్క్ పామర్ అన్నారు.

అధికారులు సంఘటన స్థలానికి  రాగానే దిల్జీత్ గ్రెవాల్ ఇంటి వెలుపల దాగి ఉన్నట్లు గుర్తించారు. అనుమానాస్పదంగా అక్కడ సంచరిస్తున్న దిల్జీత్ ను ప్రశ్నించారు. బాధితురాలు చెప్పిన పోలికలతో ఇతను సరిపోలడంతో పోలీసులు అతడిని ప్రశ్నించారు. ఇంతలోనే నేరాన్ని దిల్జీత్ కూడా అంగీకరించాడు. 

దిల్జీత్ గ్రెవాల్ మొదట కనిపించిన భవనం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అధికారులు శోధించడం ప్రారంభించారు. ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నాడు, అది అతనిది కాదని అతను ఖండించాడు. ఫోరెన్సిక్ పరీక్షలో ఆయుధం దాడి సమయంలో ఉపయోగించిన ఆయుధంగా గుర్తించబడింది.

మెట్స్ హౌన్స్లో యొక్క సేఫ్ గార్డింగ్ బృందం నుండి డిటెక్టివ్లు తక్షణ దర్యాప్తును ప్రారంభించారు, అక్కడ ఫోరెన్సిక్స్ విశ్లేషించి సిసిటివి ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. గ్రెవాల్ పై ఏప్రిల్ 29 న అత్యాచారం, దోపిడీకి పాల్పడినట్లు అభియోగాలు మోపారు. ఈ వారంలో శిక్ష విధించారు.